10th, ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్న VRA, అంగన్వాడీ ఉద్యోగులకు జీతాలు పెంచిన మీరు పీజీ లు చేసిన మా గురించి కూడా ఆలోచించండి

ప్రైవేట్ లెక్చరర్లు చేసే విధులు విద్యార్థుల ఇళ్ల చుట్టూ తిరిగి వారిని కాలేజీల్లో చేర్పించాల్సిన భాద్యత..., ఉదయం నుండి రాత్రి  వరకు వారికి బోధన చేయాల్సిన బాధ్యత..., ఎలాంటి విద్యార్థికైనా ర్యాంకు తెప్పించాల్సిన బాధ్యత...., విద్యార్థి ఫీజు చెల్లించే బాధ్యత...., తల్లిదండ్రులకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత...., పరీక్షల పేపర్లు దిద్దాల్సిన బాధ్యత..., ఇన్ని బాధ్యతలు బాధలు పడి చివరికి ఇంక్రిమెంటు అడగడానికి భయం, సెలవు అడగడానికి భయం, మన పిల్లలను ఉచితంగా చేర్పించడానికి భయం..., చివరికి ఏసీ గదుల్లో సీసీ క్రింద కూర్చోని ఏరోజు ఎన్ని ఫీజులొచ్చాయి..? వాటితో ఏ కారు కొనాలి..? ఏ ఇల్లు కొనాలి..? ఏ ప్లాటు కొనాలి..? ఏ భూమి కొనాలి..? ఇవన్నీ ఆలోచిస్తారే కానీ.... ఏ అధ్యాపకుడైనా జీతం సరిపోక బాదపడుతున్నాడా..? అధ్యాపకులకు అడ్వాన్స్ అవసరమా..? నా సంస్థను మోస్తూ నన్ను అభివృద్ధి చేసే ఈ అధ్యాపకులకు ఇంకా ఏ విధమైన ప్రోత్సాహకాలు ఇద్దామా... అని ఏ ఒక్క యాజమాన్యమైనా ఆలోచిస్తుందంటే నిజంగా వారికి రెండు చేతులా నమస్కరించవచ్చు... ఇక ఈ సీజన్లో ఖర్మ కాలి అడ్మిషన్లు కాలేదనుకోండి... నీ వల్ల ఇంత వరకు ఒక్క అడ్మిషన్ కూడా లేదు  అని మీటింగుల్లో నిలదీయడాలు....!!!
ఒక్క క్షణం... ఈ ఉపాధ్యాయుడి ఆవేదన వినండి..

   ఉద్యోగం అంటే నెల నెల వచ్చే జీతం... సామాన్య ప్రజలం ఈ జీతం తోనే కుటుంబాన్ని పోషించాలి...కాని ఎక్కడ ఎవరికి జరగని అన్యాయం మాకు  జరుగుతుంది.
  
    ఒక సంవత్సరంలో 12 నెలల జీతం ప్రతి పని చేసే వారికి ఉంది.. కానీ మా బ్రతుకులు అద్వానం...ఒక సంవత్సరంలో కేవలం 8 లేక 9 నెలల జీతం తీసుకుంటున్నాం ఎలా బ్రతకాలి, ఎలా కుటుంబాన్ని పోషించాలి, పిల్లలకు చదువు ఎలా వారి భవిష్యత్తు కలలు ఎలా నెరవేరుస్తాం..ఒక గురువు కి ఈ సమాజంలో జరుగుతున్న గొప్ప గౌరవం..
ఏప్రిల్  మే నెలల్లో జీతాలు గతి వుండవు కనుక స్పాట్ వాల్యూవేషన్ కోసం నానా తంటాలు

   ఈ గురువుల భాధ ఎవరికి అక్కర్లేదు, మీకు నిలబడి విద్యాబుద్ధులు నేర్పి ఇక్కడే నిలబడి పోయే మా జీవితాలకి అర్థం లేకుండా పోతుంది...ప్రతి పనికి కష్టం మరియు ఫలితం ఉంటాయి కాని మాకు మాత్రం కష్టం మాత్రం ఉంది ఫలితం శూన్యం...మా కష్టం ఎవరికి పట్టదు

     ఇన్ని కష్టాలున్న ఈ ఉన్నత ఉద్యోగానికి మున్ముందు ఏ ఒక్కరూ వచ్చే ధైర్యం చేయరు..
అయ్యా ముఖ్యమంత్రి గారు కేవలం ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం చేసే వారే గురువులా? 
మమ్మల్ని ఏమంటారు.. మా బ్రతుకు భాదలు మీకు తెలియదా..10th, ఇంటర్  క్వాలిఫికేషన్ ఉన్న VRA, అంగన్వాడీ ఉద్యోగులకు జీతాలు పెంచిన మీరు పీజీ లు చేసిన మా గురించి కూడా ఆలోచించండి
అయ్యా మేము ఉద్యోగం ఉన్న నిరుద్యోగులం..
ఎడారి లో ఎండమావులం.
అనుభవం తప్ప ఏమీ
సంపాదన లేని ఎర్రోల్లం
    
  ఓ విద్యార్థి సోదరా...ఈ పోస్ట్ ని షేర్ చేసి నీ గురువు భాధని...ఈ కళాశాలల యాజమాన్యాలకు, మన బంగారు తెలంగాణ ప్రభుత్వానికి తెలియజెప్పు...

....
ఇట్లు
ఓ ప్రవేటు లెక్చర‌‌ర్..

Comments

Popular posts from this blog

కులానికో గురుకులం కాదు .... అంతా ఒక్కటే బడి కావాలి

AICTE invites email, phone complaints against colleges

Pay scales of School Education Department in Government Sectors