Posts

Showing posts with the label ప్రవేటు ఉపాధ్యాయులం

10th, ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్న VRA, అంగన్వాడీ ఉద్యోగులకు జీతాలు పెంచిన మీరు పీజీ లు చేసిన మా గురించి కూడా ఆలోచించండి

ప్రైవేట్ లెక్చరర్లు చేసే విధులు విద్యార్థుల ఇళ్ల చుట్టూ తిరిగి వారిని కాలేజీల్లో చేర్పించాల్సిన భాద్యత..., ఉదయం నుండి రాత్రి  వరకు వారికి బోధన చేయాల్సిన బాధ్యత..., ఎలాంటి విద్యార్థికైనా ర్యాంకు తెప్పించాల్సిన బాధ్యత...., విద్యార్థి ఫీజు చెల్లించే బాధ్యత...., తల్లిదండ్రులకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత...., పరీక్షల పేపర్లు దిద్దాల్సిన బాధ్యత..., ఇన్ని బాధ్యతలు బాధలు పడి చివరికి ఇంక్రిమెంటు అడగడానికి భయం, సెలవు అడగడానికి భయం, మన పిల్లలను ఉచితంగా చేర్పించడానికి భయం..., చివరికి ఏసీ గదుల్లో సీసీ క్రింద కూర్చోని ఏరోజు ఎన్ని ఫీజులొచ్చాయి..? వాటితో ఏ కారు కొనాలి..? ఏ ఇల్లు కొనాలి..? ఏ ప్లాటు కొనాలి..? ఏ భూమి కొనాలి..? ఇవన్నీ ఆలోచిస్తారే కానీ.... ఏ అధ్యాపకుడైనా జీతం సరిపోక బాదపడుతున్నాడా..? అధ్యాపకులకు అడ్వాన్స్ అవసరమా..? నా సంస్థను మోస్తూ నన్ను అభివృద్ధి చేసే ఈ అధ్యాపకులకు ఇంకా ఏ విధమైన ప్రోత్సాహకాలు ఇద్దామా... అని ఏ ఒక్క యాజమాన్యమైనా ఆలోచిస్తుందంటే నిజంగా వారికి రెండు చేతులా నమస్కరించవచ్చు... ఇక ఈ సీజన్లో ఖర్మ కాలి అడ్మిషన్లు కాలేదనుకోండి... నీ వల్ల ఇంత వరకు ఒక్క అడ్మిషన్ కూడా లేదు  ...