ఎంత కాలం ఈ శ్రమదోపిడీ
నేను
ఎంసీఏ చదివి ఓ ప్రయివేటు కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్నా. బీఎడ్,
ఎంఎడ్ వంటి అధ్యాపక డిగ్రీలేవీ లేవు. కానీ మా యాజమాన్యం దాన్నే కారణంగా
చూపి అత్తెసరు జీతాన్నిస్తోంది. ఇప్పటికే ఇద్దరు అధ్యాపకులు చేయాల్సిన
పనిని ఒక్కరిపైనే మోపుతున్నారు. కనీసం వారాంతపు సెలవులు కూడా ఇవ్వరు.
కళాశాల సెలవులప్పుడు కూడా మమ్మల్ని పిలిచి ఏదో ఒక పని అప్పగిస్తున్నారు.
ఒక్కోసారి ఉద్యోగం మానేయాలనిపిస్తోంది కానీ బయట ఈ మాత్రం జీతం కూడా రాదని
భయంగా ఉంది. నన్నేం చేయమంటారు? అని ఓ సోదరి డియర్ వసుంధరకు తన ఆవేదన తెలియచేసింది..... ఇలా ఎందరో సోదర సోదరీమణులు చాలీచాలని అత్తెసరు జీతాలతో ఉద్యోగాలు చేస్తూ శ్రమదోపిడీకి గురవుతున్నారు..... ఇలా ఎంత కాలం.... ప్రశ్నించండి..... వన్ డిసిగ్నేషన్ వన్ పే కోసం. ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు సమాన వేతనాలు ఇస్తే ప్రభుత్వ ఉద్యాగాలకోసం ఉండే పోటీ తగ్గడంతో పాటు ప్రైవేట్ రంగంలో నిపుణుల కొరత తగ్గుతుంది, ప్రభుత్వ ఉద్యోగాల కోసం అభ్యర్థులు వృధా చేసే సంవత్సరాల సమయం ఆదా అవుతుంది, ఆర్థికాభివృద్ధి పెరుగుతుంది. ఒక్కసారి ఆలోచించండి ఏ నోటిఫికేషన్ చూసినా ( Group-1, Group-2, JL, DL, PGT, TGT, SI, Constable...... etc) 1:50, 1:100 కాంపిటేషన్ ఉంది. ప్రతి చిన్న ఉద్యోగానికి లక్షలలో అప్లై చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రయివేట్ ఉద్యోగులకు సమాన వేతనాలుంటే ఈ దుస్థితి రాదు. నాయకులు ఓట్ల కోసం వచ్చినప్పుడు మనం ఆగాల్సింది గవర్నమెంట్ Job కాదు ONE DESIGNATION ONE PAY కావాలి అని.
Comments
Post a Comment